అజయ్ దేవగణ్ ఒప్పుకోవడానికి కారణం !

Ajay Devgan

రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో సైడ్ పాత్రలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒప్పుకోవడానికి అసలు కారణం అజయ్ కి, తన పాత్ర బాగా నచ్చిండమేనట. సినిమా మొత్తంలోనే ఆయనది కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర అట.

కాగా అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ పోరాట విధానాన్ని మార్చుకుంటారని.. వారి పాత్రలకు ప్రధానంగా అజయ్ దేవగణ్ పాత్రనే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని, అందుకే అజయ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంలా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, అలాగే మరో కీలక పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

Exit mobile version