
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా లాంచింగ్ కాబోతున్నది.
ఈ ప్రారంభోత్సవంలోనే ఈ చిత్రం టైటిల్ ఏమిటి.. ఏ నేపథ్యంలో తెరకెక్కనుంది.. ప్రధాన పాత్రలుగా ఎవరెవరు నటించనున్నారు.. అలాగే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల పేర్లను కూడా ఈ ప్రారంభోత్సవంలోనే రాజమౌళి వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ సరికొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ట్రైనర్ స్టీవ్స్ లాయిడ్ ఆధ్వర్యంలో కసరత్తులు కూడా చేస్తున్నాడు.