నీకంటే బెటర్ భీమ్ నాకు దొరకడు- రాజమౌళి

నీకంటే బెటర్ భీమ్ నాకు దొరకడు- రాజమౌళి

Published on May 20, 2020 11:30 AM IST


దర్శక ధీరుడు రాజమౌళి తన సన్నిహితుడు, ఫేవరేట్ స్టార్ ఎన్టీఆర్ కి బర్త్ డే విశెష్ తనదైన శైలిలో చెప్పారు. వీరిద్దరూ మొదటి సినిమా కోసం పనిచేసినప్పటి ఫోటో పంచుకొని రాజమౌళి బర్త్ డే విశెష్ చెప్పారు. 2001లో ఎన్టీఆర్ రెండవ సినిమాగా వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ రాజమౌళికి దర్శకుడిగా మొదటి సినిమా. ఎన్టీఆర్ ఫస్ట్ హిట్ మూవీ స్టూడెంట్ నంబర్ వన్ కావడం విశేషం. ఆ చిత్ర షూటింగ్ టైం లో సెట్స్ లో ఎన్టీఆర్ ని కౌగిలించుకొని రాజమౌళి ఉన్న ఫొటోతో పాటు విశెష్ చెప్పాడు.

‘మొదటి నుండి నా విజయ యాత్రలో తోడుగా ఉన్నావు.. చాలా సంతోషం, హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. నీకన్నా ఉత్తమైన భీమ్ నాకు దొరకడు’ అని రాజమౌళి కొంచెం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రాజమౌళి మొదటి రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి ఎన్టీఆర్ తోనే చేశాడు. ఇక 2007లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ మూడవ చిత్రం. ఆ చిత్రం విడుదలైన 13ఏళ్లకు ఎన్టీఆర్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం కలిసి పనిచేస్తున్నారు. రాజమౌళితో 4వ సినిమా చేస్తున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం.

https://www.instagram.com/p/CAZcfAsA5CD/?igshid=1vvvvhd7g6nlo

సంబంధిత సమాచారం

తాజా వార్తలు