రాజమౌళి కుమారుడి సినిమా సగం పూర్తయింది !

Published on Mar 24, 2019 2:19 pm IST

రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా మారి ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. బాహుబలి సీరీస్ కు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం చేస్తూ.. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కాగా ఇప్పటికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గ‌త రెండు నెల‌లు నుండీ పాడేరు స‌మీపంలోని ఉన్న అట‌వీ ప్రాంతంలో వేసిన భారీ సెట్‌ లో షూటింగ్ జరుపుకుంది.

ఇక అప్పుడెప్పుడో విడుదల చేసిన ‘ఆకాశవాణి’ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ చిత్రంలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ (ఎడిటర్), సాయి మాధవ్ బుర్రా (డైలాగ్స్) వంటి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More