సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో వైవిధ్యంగా ఆకాశవాణి !

Published on Apr 10, 2019 8:22 am IST

‘ఆకాశవాణి’ సినిమాతో రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి సీరీస్ కు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం చేస్తూ.. కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఇప్పటికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే పాడేరు స‌మీపంలోని ఉన్న అట‌వీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది.

అయితే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ అంశాలకు సంబంధిచిన సన్నివేశాలతో పాటు సినిమాలోని కథాగమనం కూడా తెలుగు తెరకు కొత్తగా ఉండబోతుందట. చిన్న సినిమాల్లోనే ఈ చిత్రం పెద్ద సెక్సెస్ అవుతుందని చిత్రబృందం చెబుతుంది.

సంబంధిత సమాచారం :