తన “RRR” టీంతో కోవిడ్ పై అన్ని సందేహాలు అడిగేసిన రాజమౌళి.!

Published on Jun 4, 2021 8:03 am IST

ప్రస్తుతం ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు టైగర్ ఎన్టీఆర్ లతో భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే ప్రపంచం ఊహించని విపత్తు కరోనా రూపంలో వచ్చి తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. మరి ఓ రకంగా వీరు ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రం ఇన్ని సార్లు వాయిదా పడుతూ ఆన్ టైం రిలీజ్ కాకుండా చేసింది కూడా ఈ వైరస్సే..

అయితే ఈ వైరస్ బారిన దర్శకుడు రాజమౌళి సహా నటులు చరణ్, తారక్ మరియు సంగీత దర్శకుడు కీరవాణి కూడా పడ్డారు. అలాగే కోలుకొని అక్కడ నుంచి తమ శక్తి మేర ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కూడా స్టార్ట్ చేశారు. మరి అలాగే రాజమౌళి ఇపుడు మొత్తం తన యూనిట్ తో కలిపి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఇంట్రాక్షన్ ను ప్రముఖ డాక్టర్ శంకర్ ప్రసాద్ ద్వారా నిర్వహించి అనేక సందేహాలపై క్లారిటీ ఇచ్చారు.

కరోనా పుట్టిన దగ్గర నుంచి దాని నుంచి ఎలా కోలుకోవాలి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే ఎన్నో సందేహాల సారాంశం ఇందులో ఉంది. మరి వారు ఎలాంటి ప్రశ్నలు అడిగారో వాటికి సమాధానాలు ఏంటో రాజమౌళి ఇన్స్టా ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :