నేషనల్ అవార్డ్స్ గెలుగుకున్న రాజమౌళి ‘ఈగ’

నేషనల్ అవార్డ్స్ గెలుగుకున్న రాజమౌళి ‘ఈగ’

Published on Mar 18, 2013 3:40 PM IST

Eega (2)

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తీసిన ‘ఈగ’ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇది తెలుగు సినిమా రంగం ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకంటే నేషనల్ అవార్డ్స్ గెలుచుకోవడంలో తెలుగు సినిమా బాగా వెనుకపడి ఉంది. అలాగే ‘ఈగ’ బెస్ట్ రీజనల్ ఫిల్మ్ గా కూడా ఎంపికైంది. మొత్తంగా ‘ఈగ’ కి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.

‘2012 లో బాక్స్ ఆఫీసర్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఈగ’ లో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించాడు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకి రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసారు. కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ సినిమాకి స్క్రిప్ట్ డాక్టర్ గా ఎస్.ఎస్ కంచి పనిచేసారు. ఈ గ్రాఫికల్ మానియా మూవీ కి సాయి కొర్రపాటి నిర్మాత.

ఈ సందర్భంగా సూపర్ హిట్స్ డైరెక్టర్ రాజమౌళి గారికి, ‘ఈగ’ టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు