అన్నయ్య పిల్లలకోసం రాజమౌళి తాపత్రయం

rajamouli11

చిన్న చిత్రాలకు పబ్లిసిటీ చాలా అవసరం. క్వాలిటీ కంటెంట్ తో తెరకెక్కిన చాలా చిన్న చిత్రాలు జనాలకు చేరే లోపే థియేటర్స్ నుండి వెళ్ళిపోయిన సంధర్భాలు అనేకం. తీరా టీవీలలో, యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాక ఇంత మంచి సినిమా థియేటర్స్ లో మిస్ అయ్యామా అని ఫీల్ అవుతుంటారు. ఇక రాజమౌళి అన్నయ్య స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కొడుకులు శ్రీ సింహ, కాల భైరవ చేసిన మొదటి చిత్రం మత్తు వదలరా. ఈ చిత్రంలో శ్రీ సింహ హీరోగా పరిచయం కాగా, కాలభైవర సంగీతం అందించారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

కాగా ఈ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి తన అమూల్యమైన టైం కేటాయిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా హాజరయ్యారు. అలాగే ఈ మూవీ ప్రీమియర్ షోకి హాజరై చిత్రం బాగుందంటూ కితాబు ఇచ్చారు. అంతే కాకుండా రాజమౌళి మూవీ హీరో శ్రీసింహ మరియు ప్రధాన పాత్రలు చేసిన సత్య, అగస్త్య లతో ప్రత్యేక చర్చలో పాల్గొన్నారు. ఈ విధంగా తన అన్న కొడుకులు చేసిన మొదటి ప్రయత్నం సక్సెస్ కావడం కోసం తన వంతు బాధ్యత చాలా సీరియన్ గా నిర్వహిస్తున్నారు.

Exit mobile version