రజనీతో సినిమాపై రాజమౌళి రెస్పాన్స్!

రజనీతో సినిమాపై రాజమౌళి రెస్పాన్స్!

Published on Aug 4, 2015 11:40 AM IST

rajamouli-and-rajinikanth
తన సినిమా విడుదలవుతోందంటే చాలు.. ఒక్క తమిళ సినీ పరిశ్రమే కాక, యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేయగల హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్. ఇక తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన దర్శక ధీరుడు రాజమౌళి. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే అద్భుతంగా ఉంది కదూ! మరి ఈ కాంబినేషన్‌పై దర్శకుడు రాజమౌళి కూడా ఎగ్జైటింగ్‌గానే ఉన్నారు.

గతంలో రజనీకాంత్ స్వయంగా రాజమౌళితో ఓ సినిమా చేయాలనుందని ఒక కార్యక్రమంలో తెలిపిన విషయం తెలిసిందే! ఇదే విషయాన్ని రాజమౌళి ముందు ప్రస్తావిస్తే ఆయన మాట్లాడుతూ.. “రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేయమని అడగడం గొప్ప విషయమే! అయితే ఒక స్టార్ హీరోతో సినిమా తీయాలంటే ముందు అందుకు తగ్గ బలమైన కథ ఒకటి ఉండాలి. స్టార్‌డమ్ అంటే వెనుక వరుసగా పేర్చి ఉన్న సున్నాలు. మనం ఆ సున్నాలకు ముందు ఒక బలమైన కథతో ఒకటో, రెండో ఇలా నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. రజనీ గారు ఆఫర్ ఇవ్వడమనేది గొప్ప ఫీలింగ్, అందుకు ఒక కథ ఉంటేనే నేను ఆ సినిమా చేయగలను” అన్నారు. ప్రస్తుతం రాజమౌళి, తన బాహుబలి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే ‘బాహుబలి 2’తో రాజమౌళి టీమ్ మళ్ళీ బిజీ కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు