తండ్రి సినిమా కోసం రాజమౌళి ఏం చేయబోతున్నాడంటే..!
Published on May 25, 2017 3:31 pm IST


దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.తన తండ్రి సినిమాకి రాజమౌళి వాయిస్ ఓవర్ అని అందించనున్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని పాత్రలన్నీ రాజమౌళి వాయిస్ ఓవర్ తో పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.నేహా హింగే ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తోంది. రాజీవ్ కనకాల ఓ కీలకపాత్రని పోషిస్తున్నాడు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం రాజమౌళి వాయిస్ ఓవర్ తో మంచి హైప్ ని పొందుతుందనడంలో సందేహం లేదు.

 
Like us on Facebook