చైనా లో రజని ‘2.0’ భారీ విడుదల.

Published on Jun 3, 2019 5:55 pm IST

రజని కాంత్ గత సంవత్సరం రెండు సినిమాలతో బాక్సఫీస్ వద్ద సందడి చేసాడు.వాటిలో ఒకటి పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కలా, కాగా మరొకటి శంకర్ తీసిన 2.0. 2010 లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ రోబో కి సీక్వెల్ గా వచ్చిన 2.0 మంచి వసూళ్లనే రాబట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఇప్పడు రజని 2.0 చైనాలో విడుదలకు సిద్ధమైంది. చైనా వ్యాప్తంగా జులై 12న దాదాపు 10000 థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే అన్ని భాషలలో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల వరకు ఈ మూవీ వసూలు చేసింది. చైనాలో కనీసం 300 కోట్ల వసూళ్లు సాధించి 1000 కోట్ల క్లబ్ లో ఈ మూవీ చేరుతుందని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారంట. రజని మూవీస్ కి జపాన్,కొరియా దేశాలలో కూడా మంచి మార్కెట్ ఉంది. మరి చైనా లో ‘2.0’ ఎంత పెద్ద విజయం నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More