రాజరథం’ నుండి మరొక పాట !
Published on Mar 7, 2018 6:41 pm IST

జాలీ హిట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘రాజరథం’. అన్ని పనుల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 23న రిలీజ్ కానుంది. అందుకే టీమ్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఇప్పటికే ఆడియోలో రెండు పాటలు ‘కాలేజ్ డేస్, నీలి మేఘమా’ మంచి స్పందనను దక్కించుకోగా ఇప్పుడు మూడో పాట ‘చల్ చల్ గుర్రం’ విడుదలకానుంది.

ఈ పాటను రేపు 9వ తేదీ రాత్రి 7 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను నటుడు రవి శంకర్ స్వయంగా పాడటం విశేషం. నిరుప్‌ భండారి, ఆర్య, అవంతిక శెట్టిలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రానా వాయిస్ ఓవర్ అందించారు. భారీ బడ్జెట్ తో అనూప్ బండారి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కన్నడలో కూడ రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook