ఆయన కరుణించి మాకు ఓకే చెప్పారు – రాజశేఖర్

Published on Feb 3, 2019 7:39 pm IST

‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ అవతార్ టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం.

ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ… ‘ఈ సినిమా గురించి పూర్తిగా.. విడుదలైన తర్వాతే మాట్లాడతాను. ఇక ఫిబ్రవరి 4 నా పుట్టినరోజు, ‘కల్కి’ టీజర్ ను కూడా ఆ రోజే విడుదల చేస్తాము. చాలా సబ్జెక్టులు విన్న తరువాత చివరకు ‘కల్కి’ కథను ఫైనల్ చేశాము. కానీ మా దర్శకుడు ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాం. చివరకు ఆయన కరుణించి మాకు ఓకే చెప్పారు. ఇక సి కళ్యాణ్ గారు నాతో ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం నాకు పెద్ద ప్రమోషన్ లాంటిది.

రాజశేఖర్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు బయట చాలా చెడ్డపేరు ఉందని నాకు తెలుసు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. అలాగే మా దర్శకుడిని ఇబ్బంది పెట్టాననే వార్తలు కూడా నిజం కాదు’ అని ఆయన చెప్పారు.

ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :