హానెస్ట్ ట్రైలర్ తో అదరగొట్టిన యాంగ్రీ స్టార్ !

Published on Jun 25, 2019 11:04 am IST

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. కాగా తాజాగా ఈ సినిమా హానెస్ట్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌ తో మొదలైన ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది.

ముఖ్యంగా నాజర్ పలికిన డైలాగ్ ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అన్న మాట తరువాత రాజశేఖర్‌ గొడ్డలి పట్టుకుని వచ్చే బిల్డప్ షాట్స్.. అలాగే ట్రైలర్ లోని నేపధ్య సంగీతం కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.

శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More