సూదు కవ్వం రీమేక్ లో రాజశేఖర్

సూదు కవ్వం రీమేక్ లో రాజశేఖర్

Published on Apr 17, 2014 4:19 AM IST

hero_rajasekhar
కెరీర్ లో కొత్త ఇన్నింగ్స్ వైపుకి రాజశేఖర్ ప్రయాణం సాగుతుంది. రాం గోపాల్ వర్మ హర్రర్ సినిమా పట్టపగలుతో వార్తలలో నిలిచినా ఈయన ఇప్పుడు ‘సొదు కవ్వం’ అనే తమిళ సినిమా రీమేక్ లో నటించనున్నాడు

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో విజయ్ సేతుపతి, సంచిత శెట్టి నటించారు. ఈ సినిమా రిమేక్ హక్కులను పి.వి.పి సంస్థ గత యేడు సొంతం చేసుకుంది. కార్యరూపం దాల్చడానికి కాస్త సమయం పట్టినా సరైన తారాగణంకోసం ఎదురుచుసామని చిత్రవర్గాలు తెలిపాయి. తారల వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు

దీనిపై రాజశేఖర్ మాట్లాడుతూ “నాకు విభిన్న పాత్రలు చేసే అవకాశం వస్తుంది. రానున్న ఐదేళ్ళలో వరుసపెట్టి సినిమాలు చేస్తాను” అని తెలిపాడు. మరి ఆయన కొత్త ఇన్నింగ్స్ లో విజయాలు రావాలని కోరుకుందాం

తాజా వార్తలు