‘గడ్డం గ్యాంగ్’కి రాజశేఖర్ ఓన్ డబ్బింగ్

‘గడ్డం గ్యాంగ్’కి రాజశేఖర్ ఓన్ డబ్బింగ్

Published on Jan 15, 2015 10:52 PM IST

gaddamgang2
విలక్షణ నటుడు డా. రాజశేఖర్ త్వరలోనే తమిళ సూపర్ హిట్ అయిన ‘సూదు కవ్వం’ సినిమా రీమేక్ అయిన ‘గడ్డం గ్యాంగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ సినిమాలో ఆడియన్స్ కి ఓ థ్రిల్ ఉండనుంది. అదేమిటంటే మామూలుగా రాజశేఖర్ అన్ని సినిమాలకు సాయి కుమార్ లేదా సాయి కుమార్ బ్రదర్స్ డబ్బింగ్ చెప్పేవారు. కానీ ఈ సారి మాత్రం రాజశేఖర్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్నాడు.

రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ సినిమాలో ఓ దొంగ పాత్రలో కనిపిస్తాడు. ఆ పాత్రకి డైలాగ్స్ పెద్దగా ఉండవు. అందుకే తన వాయిస్ అయితేనే పాత్రకి పర్ఫెక్ట్ గా ఉంటుందని ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి చూపినట్లు సమాచారం. త్వరలోనే రాజశేఖర్ సరసన షీన హీరోయిన్ గా నటిస్తోంది. జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సూదు కవ్వం’ సినిమా తమిళనాడులో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సరికొత్త ట్రెండ్ ని కూడా సెట్ చేసింది. అదే మేజిక్ ని ఇక్కడ రాజశేఖర్ రిపీట్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

తాజా వార్తలు