‘కల్కి’ వచ్చేది ఎప్పుడు ?

‘కల్కి’ వచ్చేది ఎప్పుడు ?

Published on Jun 5, 2019 2:35 PM IST


‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదల ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మొదట మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదట. పైగా ప్రశాంత్ వర్మ అవుట్ ఫుట్ విషయంలో పూర్తి సంతృప్తికరంగా లేడని తెలుస్తోంది. ఈ లెక్కన సినిమా విడుదల మరో రెండు నెలలు పట్టొచ్చు.

అయితే ప్రశాంత్ వ‌ర్మ తన మొదటి సినిమా ‘అ’ తో మంచి పేరు తెచ్చుకోవటం.. రాజ‌శేఖ‌ర్ కూడా గరడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నటిస్తుండటంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గరుడవేగ చిత్రంలాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనెర్ గా రాబోతున్న ఈ సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు