‘కల్కి’తో కొత్తరకంగా ట్రై చేస్తున్న డా రాజ‌శేఖ‌ర్ !
Published on Aug 26, 2018 6:34 pm IST

సీనియర్ హీరో డా రాజ‌శేఖ‌ర్, యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రాజ‌శేఖ‌ర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ రోజు ఉదయం ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు రాజశేఖర్‌. అయితే మోషన్ పోస్టర్ చాలా వినూత్నంగా ఉండటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు పెడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మోషన్ పోస్టర్ హల చల్ చేస్తోంది. మరి గరుడవేగ చిత్రం లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

  • 7
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook