‘కల్కి’ తరువాత రాజశేఖర్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్…!

Published on Jun 26, 2019 8:25 am IST

రాజశేఖర్ హీరోగా ‘అ!’ వంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రశంసలందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు.ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నఈ చిత్ర ట్రైలర్ నిన్న విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకుంటుంది. రాజశేఖర్ ‘గరుడవేగ’ తరువాత మరో ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తారనిపిస్తుంది.

ట్రైలర్ విడుదల సంధర్బంగా జరిగిన కార్యక్రమలో రాజశేఖర్ ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు. ‘కల్కి’ మూవీ తరువాత ఆయన “గరుడవేగ” మూవీకి సీక్వెల్ లో నటిస్తారట. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన “గురుడవేగ” రాజశేఖర్ ని మళ్ళీ హీరో గా నిలబెట్టిన చిత్రం. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. రాజశేఖర్ వైవిధ్యమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ మళ్ళీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More