మా వివాదంపై రాజశేఖర్ రియాక్షన్

Rajasekhar

నిన్న హీరో రాజశేఖర్ మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ వేదికగా మీడియా ముందు మా అసోసియేషన్ లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు వంటి వారు వేదికపై ఉండగా ప్రవర్తించిన తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. రాజశేఖర్ చర్యలకు సహనం కోల్పోయిన చిరంజీవి రాజశేఖర్ పై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి హీరో రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. మా అసోసియేషన్ లో జరుగుతున్న అనారోగ్య కరమైన వ్యవహారాల కారణంగా నేను అలా ప్రవర్తించాల్సి వచ్చింది. నా చర్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలి అని ఆయన అన్నారు.

Exit mobile version