
డా. రాజశేఖర్ మళ్ళీ సినిమాలపై దృష్టి సారించాడు. అందుకే వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. తను వరుసగా సినిమాలు చేయడమే కాకుండా తన కుమార్తె శివానిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాడు.
శివాని ‘వందకి వంద’ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కానుంది. అలాగే ఈ సినిమా శివాని కెరీర్ కి హెల్ప్ అయ్యే పర్ఫెక్ట్ సినిమా అని రాజశేఖర్ అంటున్నాడు. ‘శివాని తొలి సినిమా కోసం చాలా కథలు విన్నాం. కానీ సెట్ అవ్వలేదు లక్కీగా వందకి వంద సినిమా కథ వచ్చింది. చాలా ఆసక్తిగా ఉండే ఈ సినిమాలో తను చాలా కీలక పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని’ రాజశేఖర్ అన్నాడు. రాజశేఖర్ చేసిన ‘పట్ట పగలు’ రిలీజ్ కి సిద్దమవుతుంటే ‘గడ్డం గ్యాంగ్’ సినిమా ప్రస్తుతం సెట్స్ పైన ఉంది.

