అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. ప్రేమికుల రోజున అక్కినేని కుటుంబం అఖిల్ ని హీరోగా లాంచ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఈ రోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. వివి వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ద్వారా అఖిల్ తో పాటు సయేశా సైగల్ ని హీరోయిన్ గా పరిచయం చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరబాద్ లోని ఓల్డ్ సిటీలో జరగనుంది. ముందుగా అఖిల్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు.
ఈ సినిమా గురించి మాకు తాజాగా ఓ విషయం తెలిసింది. అదేమిటంటే ఈ సినిమాలో అఖిల్ కి ఫాదర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నాడని సమాచారం. కథా పరంగా అఖిల్ ఫాదర్ పాత్రకి రాజేంద్ర ప్రసాద్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆయన్ని అప్రోచ్ అయ్యారని, ఆయన కూడా దీనికి సముఖత చూపినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ లో మనము ఆన్ స్క్రీన్ పై కొన్ని కడుపుబ్బా నవ్వించే సీన్స్ చూడచ్చు. ఈ చిత్ర టీం హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత సౌత్ ఆఫ్రికా, యుఎస్ లలో మేజర్ పార్ట్ ని షూట్ చేయనున్నారు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ – అనూప్ రూబెన్స్ కలిసి మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి నితిన్ నిర్మాత.


