థియేటర్ల సంఖ్య పెంచుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ ‘నేనెవరు?’

థియేటర్ల సంఖ్య పెంచుకుంటున్న రాజేంద్ర ప్రసాద్ ‘నేనెవరు?’

Published on May 30, 2026 8:20 AM IST

Rajendra Prasad Nenevaru

రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సందేశాత్మక చిత్రం ‘నేనెవరు?’. చిరంజీవి తన్నీరు దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 29న థియేటర్లలో విడుదలైంది. అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని, దీంతో పలు ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.

కుటుంబ ప్రేక్షకులను ఈ కథ ఆకట్టుకుంటుండటంపై రాజేంద్ర ప్రసాద్ ఆనందం వ్యక్తం చేస్తూ, దర్శకుడు, నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులను అభినందించారు. ఇందులో సాయికిరణ్, జోగిని శ్యామల ఇతర కీలక పాత్రలు పోషించారు. సినిమాలోని భావోద్వేగాలు, ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ చిత్రానికి చిన్నికృష్ణ సంగీతం అందించగా, నాయుడు ప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సామాజిక అంశాలతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు వస్తున్న స్పందన పట్ల హర్షం వ్యక్తం చేసిన నిర్మాతలు, రానున్న రోజుల్లో మరిన్ని కేంద్రాల్లో సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు