మా కధను కాపీకొట్టారంటూ ఈ మధ్య తమిళనాట వరుసపెట్టి కత్తి, లింగ వంటి రెండు సినిమాలు ఈ వలయంలో చిక్కుకున్నాయి. రవిరత్నం అనే చోటా ప్రొడ్యూసర్ రవిరత్నం లింగ సినిమా స్టోరీ తాను 2013లో నిర్మించిన ఒక కధను కాపీ కొట్టారంటూ కోర్టుకెక్కాడు
ఈ వివాదంపై తొలిసారిగా రజినీకాంత్ స్పందించారు. ఇటువంటి కేస్ లు తన ఇమేజ్ ని తగ్గించేందుకు, రెండు నిముషాలలో క్రేజ్ ని సంపాదించుకునేందుకు ఉపయోగించే చిల్లర అస్త్రాలని తెలిపారు. అంతేకాక లింగ సినిమా కధను అందించింది పోనుకుమారాన్ అని దానికి కే.ఎస్ రవికుమార్ స్క్రీన్ ప్లే జతకలిపి దర్శకత్వం వహించారని చెన్నై హైకోర్టులో అఫిడివేట్ ఫైల్ చేసాడు.


