డబ్బింగ్ పూర్తి చేసిన రజిని కాంత్

Published on Nov 18, 2019 6:50 pm IST

తలైవా రజిని కాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ దర్బార్. ఇటీవలే ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. కాగా దర్బార్ చిత్ర డబ్బింగ్ పూర్తయిందని సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు మురుగదాస్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిని పోలీస్ అధికారిగా నటిస్తుండగా, నయనతార ఆయనకి జంటగా నటిస్తుంది.

ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ తెలుగు మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. త్వరలోనే దర్బార్ మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. లైకా మూవీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.సంక్రాంతి కానుకగా దర్బార్ మూవీ విడుదల కానుంది. కాగా రజిని తన తదుపరి చిత్రం దర్శకుడు శివతో కమిట్ ఐయ్యారు. 3

సంబంధిత సమాచారం :

X
More