ఆ విషయంలో చాలా బాధపడుతున్న రజని..!

Published on Jun 23, 2019 7:00 pm IST

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు నేటి ఉదయం ప్రారంభమై ప్రశాంతగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు వేయడానికి తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోలు అయిన విజయ్,విక్రమ్,అజిత్, కార్తీ,సూర్య వంటి నటులతో పాటు 3000 పైచిలుకు సభ్యత్వం కలిగిన నటులు,ఇతర సాంకేతిక నిపుణులు అందరూ వచ్చి తమ అభిమాన వర్గానికి ఓటు వేయడం జరిగింది.

ఐతే తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు సూపర్ స్టార్ రజని కాంత్ ఈ ఎన్నికలలో పాల్గొన లేకపోయారు.ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయనకి చివరికి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కూడా లేకుండా పోయిందట. ఈ విషయంపై స్పందించిన రజనీకాంత్ నడిగర్ సంఘం ఎన్నికలలో ఓటు వేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను అన్నారు. అలాగే ఈ ఎన్నికలలో పోటీచేస్తున్న రెండు వర్గాల సభ్యులకి బెస్ట్ విషెస్ చెప్పారు. ప్రస్తుత ఎన్నికలలో విశాల్ టీంతో భాగ్యరాజ్ టీం పోటీపడుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More