‘కాలా’ గురించి రజినీ ఏమ్మన్నారంటే !
Published on Jun 15, 2018 9:55 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్లో జరుగుతోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వూలో రజినీ ఈచిత్రం గురించి అలాగే తను నటించిన ‘కాలా’సినిమా గురించి మాట్లాడారు. దేవుడి దయవల్ల ‘కాలా’ సినిమా ఇండియాలో మరియు ఓవర్సిస్లో చాలా భాగా రన్ అవుతోంది. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం డార్జిలింగ్ అందాలను దేశానికి పరిచయం చేసేట్టుగా తెరకెక్కుతోందని అన్నారు.

ఇటీవల రజినీ వరుసగా యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే పా.రంజిత్ తో రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు ఈచిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్ కు అవకాశం ఇచ్చారు తలైవా ఇచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు పా.రంజిత్. మరి ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ అయినా రజినీ ఇచ్చిన ఈ ఛాన్స్ ను పూర్తిగా ఉపయోగించుకుంటారో లేదో చూడాలి .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook