షర్ట్ లెస్ సూపర్ స్టార్ లుక్ కేకగా ఉందిగా… !

Published on Sep 12, 2019 7:21 am IST

స్టైల్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ రజిని కాంత్. వయసు పైబడినా ఆయన మాస్ మేనరిజం, సూపర్ స్టైలిష్ మూమెంట్స్ ఇప్పటికీ ఫేమస్సే. ఆయన ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరదశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

కాగా ఈ మూవీలోని రజిని లుక్ ని విడుదల చేశారు. బ్లాక్ కలర్ బనియన్ ధరించి, సీరియస్ గా ఉన్న ఆయన లుక్ ఫెరోషియస్ గా ఉంది. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిని సీరియస్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత దర్బార్ చిత్రంలో మరలా ఆయన పోలీస్ గా నటిస్తున్నారు. నయనతార రజినికి జంటగా నటిస్తుండగా, యంగ్ సెన్సేషన్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More