రజినీ ‘లింగ’ ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్

రజినీ ‘లింగ’ ఓవర్సీస్ కలెక్షన్ రిపోర్ట్

Published on Dec 15, 2014 12:53 PM IST

lingaa
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘లింగ’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా కొంతవరకూ మాత్రం మెప్పించగలిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2500కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అంతే కాకుండా ఒక్క యుఎస్ లోనే 300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది.

యుఎస్ నుంచి అక్కడి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో $1.205 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్స్ కరెన్సీ ప్రకారం 7.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.ఇది కాకుండా తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసారు. ఈ మూడు భాషలకు సంబందించిన కలెక్షన్ వివరాలను మీకందిస్తాం. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు