సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘లింగ’ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీకాంత్ కెరీర్లో మొట్ట మొదటిసారిగా తన బర్త్ డే రోజున విడుదలవుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత వారం రోజుల నుంచి ఈ సినిమా టికెట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోమవారం నుంచే తమిళనాడులో బుకింగ్ ఓపెన్ అయ్యింది. కానీ బుకింగ్ ఓపెన్ అయిన కొద్ది సేపటికే మొదటి నాలుగు రోజులకి హౌస్ ఫుల్ అయిపోయాయి.
ఇదే డిమాండ్ తెలుగులో కూడా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే అన్ని థియేటర్స్ కి సంబందించిన బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేసిన కొద్దిసేపటికే అన్ని చోట్లా వీకెండ్ కి హౌస్ ఫుల్ అవుతున్నాయి. రిలీజ్ రోజుతో పాటు మిగిలిన రోజులకి కూడా బుకింగ్ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. ‘ముత్తు’, ‘నరసింహా’ తర్వాత కెఎస్ రవికుమార్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో అనేది చూడాలి అంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..
రజినీకాంత్ సరసన సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ సినిమాని ఈరోస్ వారు రిలీజ్ చేస్తున్నారు.


