సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నిన్ననే ట్విట్టర్ లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అందరి దృష్టి దానిపైనే ఉంది. అకౌంట్ ఓపెన్ చేసిన ఒక్క రోజులోనే రజినీకాంత్ సరికొత్త రికార్డ్ ని సృష్టించాడు.
రజినీ కాంత్ కేవలం 24 గంటల్లో 2 లక్షలకి పైగా ఫాలోవర్స్ ని రాబట్టుకున్నాడు. ఇప్పటి వరకూ ఏ ఒక్క ఇండియన్ సెలబ్రిటీ కూడా కేవలం 24 గంటల్లో ఇంతమంది ఫాలోవర్స్ ని పొందలేదు. ఇండియాలో ఇలా అత్యధిక ఫాలోవర్స్ ని పొందిన వారిలో రజినీ కాంత్ మొదటి వాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా రజినీ 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
రజినీకాంత్ హీరోగా నటించిన బిగ్ బడ్జెట్ మోషన్ పిక్చర్ టెక్నాలజీతో తెరకెక్కించిన ‘విక్రమసింహా’ మే 9న రిలీజ్ కానుంది. మామూలుగా తన సినిమాలతో ఎప్పుడూ బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ కొల్లగొట్టే రజినీ ఇప్పుడు సైబర్ వరల్డ్ లో రికార్డ్స్ కొల్లగొడుతున్నాడు.


