మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సూపర్ స్టార్ ?

Published on Apr 11, 2019 12:16 pm IST

పొలిటికల్ పార్టీ పెట్టాక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల విషయంలో జోరు తగ్గిస్తాడేమో అనుకుంటే గతంలో కంటే ఇప్పుడే బ్రేక్ లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇటీవల పేట తో ప్రేక్షకులముందుకు వచ్చిన రజినీ ప్రస్తుతం ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత రజినీ మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

అందులో ఒకటి సీనియర్ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ తో సినిమా చేయనుండగా యంగ్ డైరెక్టర్ వినోత్ తో మరో సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాల్లో మొదటగా ఏ సినిమాను చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తాడో చూడాలి.

ఇక ఈ సినిమాలను పూర్తి చేసిన తరువాత తలైవా పాలిటిక్స్ లో బిజీ కానున్నాడు. 2021 మే లో తమిళనాడు లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల భరిలో తన పార్టీ ని నిలుపనున్నారు రజినీకాంత్.

సంబంధిత సమాచారం :