సూపర్ స్టార్ రజనీకాంత్ తన తర్వాతి సినిమాను యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే వారంలో మొదలుకానుంది. ఈ 7వ తేదీ ‘కాలా’ విడుదల చూసుకుని రజనీ ఈ షూటింగ్లో పాల్గొననున్నారు. మొదటి షెడ్యూల్ ను ఎక్కువ భాగం ఉత్తరాఖాండ్ లోని హిమాలయ ప్రాంతాల్లో చిత్రీకరిస్తారట.
ఈ షెడ్యూల్ ఎక్కువ రోజుల పాటు జరగనుందని కూడ తెలుస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, బాబీ సింహ, మేఘా ఆకాష్ లు నటిస్తుండగా రజనీకి జోడీగా అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీ, సుబ్బరాజ్ ల క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంపై తమిళ సినీ ప్రేక్షకుల్లో ఆమిసనాసక్తి నెలకొని ఉంది.


