రజినీకాంత్ 173 చిత్రానికి ముహూర్తం ఫిక్స్.. ఆ సస్పెన్స్ వీడేది ఎప్పుడంటే..?

రజినీకాంత్ 173 చిత్రానికి ముహూర్తం ఫిక్స్.. ఆ సస్పెన్స్ వీడేది ఎప్పుడంటే..?

Published on Jan 2, 2026 9:02 PM IST

Thalaivar173

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్‌లోని 173వ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే, తొలుత ఈ సినిమాకు సుందరి సి డైరెక్టర్ అని ప్రకటించినా, ఆ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. జనవరి 3న ఉదయం 11 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ ఉండబోతుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో తమిళ ప్రేక్షకులు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. తమ అభిమాన సూపర్ స్టార్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాబోతుందా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఈ చిత్రాన్ని 2027 పొంగల్ బరిలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది ఎవరనే సస్పెన్స్ ఎప్పుడెప్పుడు వీడుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

తాజా వార్తలు