Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
నా సినిమాకి ప్రమోషన్స్ అవసరంలేదు- రజినీకాంత్ !
Published on Jun 5, 2018 1:15 pm IST

భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న నటుడు రజినీకాంత్ . ఒక్క ఇండియాలోనే కాదు జపాన్, మలేషియా దేశాలలో కూడా ఈయనని ఎంతో మంది ఇష్టపడుతారు.
మరి అలాంటిది అయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. తాజాగా అయన నటించిన చిత్రం కాలా .

ఇటీవల తూత్తుకూడిలో పర్యటించారు రజినీకాంత్. ‘కాలా’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే ఈ పర్యటన చేశారా అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు తలైవా. ఈ వయసులో ఈ రకంగా నా సినిమాలకు ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు చాలా అనుభవం ఉంది. దేవుడి దయవల్ల అభిమానులు ఉన్నారు. నా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని వివరించారు. ఇక కాలా చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

  •  
  •  
  •  
  •