సూపర్‌ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది !

సూపర్‌ స్టార్ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది !

Published on Sep 23, 2018 6:59 PM IST

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తమిళ్ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 2.ఓ. తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై యూట్యూబ్ లో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. దీపావళి రోజు ఈ చిత్ర ట్రైలర్ విడుదలకానుంది. దీని కోసం భారీ ఈవెంట్ ను కూడా ఏర్పాటుచేయనున్నారు. మొత్తగానికి విజువల్‌ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తో అంచనాలను బాగానే పెంచింది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 21న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు