సూపర్ స్టార్ రజినీకాంత్ రెండవ కుమార్తె, ‘కొచ్చాడియాన్’ సినిమా దర్శకురాలు సౌందర్య రజినీకాంత్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ వార్త తెలియగానే రజినీకాంత్ ఇంట ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో 2010లో సౌందర్యకు వివాహం జరిగింది.
రజినీకాంత్ పెద్దమ్మాయి ఐశ్వర్య, హీరో ధనుష్ లకు ఇద్దరు కుమారులు. వీరంటే రజినీకాంత్ కు ఎంతో ప్రేమ. ఇటీవల రజిని నటించిన ‘లింగ’ సినిమాకు మనవడి పేరే పెట్టారు. తాజాగా తన ఇంట్లో అడుగుపెట్టబోయే మరో చిన్నారి కోసం ఈ సూపర్ స్టార్ ఎదురుచూస్తున్నారు.
ఈరోస్ ఇంటర్నేషనల్ లో క్రియేటివ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు హెడ్ అఫ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ గా సౌందర్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.’కొచ్చాడియాన్’ సినిమా ఆడియో వేడుకలో కెరీర్ కంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సౌందర్యకు రజిని సూచించారు. అప్పుడే మరోసారి రజిని తాతయ్య కావాలని కోరుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.


