చెన్నై ప్రజల దాహార్తి తీర్చిన సూపర్ స్టార్ ఫ్యాన్స్

చెన్నై ప్రజల దాహార్తి తీర్చిన సూపర్ స్టార్ ఫ్యాన్స్

Published on Jun 23, 2019 3:00 AM IST

తీవ్ర నీటి కొరతతో కనీసం త్రాగునీరు కూడా లేక నరకం అనుభవిస్తున్నచెన్నై నగర ప్రజలకి రజని ఫ్యాన్స్ ఉచితంగా నీటిని సరఫరా చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన జలాశయాలు ఎండిపోవడంతో మునుపెన్నడూ లేని నీటి కొరతని చెన్నై నగరం చవిచూస్తోంది. హోటళ్లలో సైతం ఒక గ్లాస్ కంటే ఎక్కువ మంచినీళ్లు ఇవ్వడం లేదు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు నీటి సమస్యతో ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచించాయి. కాగా ఈ సమస్య నుంచి ప్రజలకు కాస్త ఊరట కల్గించేందుకు రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ముందుకొచ్చారు.

రజని అభిమాన సంఘమైన ‘రజనీ మక్కల్‌ మంద్రం’ శనివారం ఉచితంగా నీటిని సరఫరా చేసింది. ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని పలుప్రాంతాలలోని ప్రజలకు నీరు సరఫరా చేసింది. .మరోపక్క తమిళనాడులో నీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పళనిస్వామి చర్యలు తీసుకుంటున్నారు. రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు