ఆకట్టుకుంటోన్న రజినీకాంత్ ‘లాల్ సలాం’ ఫస్ట్ పోస్టర్

ఆకట్టుకుంటోన్న రజినీకాంత్ ‘లాల్ సలాం’ ఫస్ట్ పోస్టర్

Published on Nov 5, 2022 5:00 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక సర్ప్రైజింగ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలాం. రజినీకాంత్ సినీ కెరీర్ 170వ మూవీగా రూపొందనున్న లాల్ సలాం అఫీషియల్ పూజా కార్యక్రమాలు నేడు ఎంతో వైభవంగా జరిగాయి. రజిని కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సుభాస్కరన్ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది యూనిట్. క్రికెట్ హెల్మెట్, బాల్, గ్లౌజులు, స్టంప్స్ వంటివి మంటల్లో కాలిపోతున్న సన్నివేశంతో కూడిన ఈ పోస్టర్ ప్రస్తుతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీ యాక్షన్ తో కూడిన భారీ ఎంటర్టైనర్ గా దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు