పెళ్లి రోజున అభిమానులతో రజినీకాంత్..

rajini-kanth
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు నేడు పండుగ రోజు. ఫిబ్రవరి 26, 1981లో లతతో రజినీకాంత్ వివాహం జరిగింది. నేడు రజినీకాంత్ తన 34వ వివాహ వార్షికోత్సవంను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు రజినీకాంత్ దంపతులకు శుభాకాంక్షలు తెలపడానికి చెన్నైలో ఆయన ఇంటికి వచ్చారు.

తన ఇంటి బయట వేచి ఉన్న అభిమానులతో రజినీకాంత్ కొద్ది సమయం గడిపారు. వారు తీసుకొచ్చిన పూల బొకేలను స్వీకరించారు. తనపై ఇంతటి ప్రేమాభిమానాలు చూపుతున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

రజినీకాంత్ నటించిన గత సినిమా ‘లింగ’ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా శంకర్ దర్శకత్వంలో ‘రోబో 2’లో నటిస్తారు అనే ప్రచారం జరుగుతుంది.

Exit mobile version