ఆ స్టార్ హీరో సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉండవట !

Published on May 30, 2018 8:05 pm IST


సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి దిగిన తర్వాత ఆయన చేస్తున్న సినిమాలపై ప్రేక్షకులు, రాజకీయ రంగ ప్రముఖుల దృష్టి ఎక్కువైంది. ఆయన తన సినిమాల ద్వారా రాజకీయ, సామాజిక పరమైన అంశాలు వేటినైనా లేవనెత్తుతారా అని అంతా ఆసక్తిగా చూస్తుండగా రజనీ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో రాజకీయ పరమైన చురకలు ఉంటాయని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి.

కానీ ప్రస్తుతం తమిళ మీడియా ద్వారా తెలుస్తున్న సమాచారం మేరకు ఆ సినిమాలో అలాంటివి ఏవీ ఉండవని, చిత్రం ఒక క్రైమ్ డ్రామాగా ఉంటుందని, కథ రజనీ, ప్రతినాయకుడు విజయ్ సేతుపతిల మధ్యనే నడుస్తుందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంఫై నిర్మితంకానున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. ఇకపోతే పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ చేసిన ‘కాలా’ సినిమా జూన్ 7న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :