హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్

హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్

Published on Oct 13, 2019 1:10 PM IST

సూపర్ స్టార్ రజనీకి దైవచింతన చాలా ఎక్కువ. నిత్యం దైవారాధనలో ఉండే ఆయన అప్పుడప్పుడు హిమాలయాల పర్యటనలకు కూడా వెళుతుంటారు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ‘దర్బార్’. సినిమాలో తన వంతు పనుల్ని కంప్లీట్ చేసిన ఆయన బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

అందుకే హిమాలయాలకు బయలుదేరారు. ఇంకో పది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. పని ఒత్తిడి నుండి రిలీఫ్ అయ్యాక తిరిగొచ్చి తన కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘వివేగం, వేదాళం’ ఫేమ్ శివ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఇకపోతే ‘దర్బార్’ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు