‘లింగ’ సమస్యని పరిష్కరించిన రజినీకాంత్

‘లింగ’ సమస్యని పరిష్కరించిన రజినీకాంత్

Published on Mar 22, 2015 12:01 PM IST

lingaa1
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వల్లా డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది రోడ్డు మీదకి వచ్చేశారు. అప్పటి నుంచే డిస్ట్రిబ్యూటర్స్ కి – నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కి మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చల్లో ఫైనల్ గా రాక్ లైన్ వెంకటేష్ 10% మాత్రమే వెనక్కి ఇస్తానని చెప్పడంతో ఈ వివాదం మరింత ఎక్కువైంది. ఇక చేసేది ఏమీ లేక డైరెక్ట్ గా రజినీకాంత్ రంగంలోకి దిగాడు.

రజినీకాంత్ అమౌంట్ మొత్తాన్ని ప్రొడ్యూసర్ కి ఇచ్చి డిస్ట్రిబ్యూటర్స్ కి అందరికీ పంచేయమన్నారు. `నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ అందరికీ అమౌంట్ ని సెటిల్ చేసాడు. తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కలైపులి ఎస్ థను ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా రజినీకాంత్ లింగ డిస్ట్రిబ్యూటర్స్ సమస్య తొలగింది. ఇప్పుడు అందరూ వారి నిరసనలను విరమించరని తెలియజేశాడు. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ‘లింగ’ సినిమా గత డిసెంబర్ లో రిలీజ్ అయ్యి పరాజయం పాలైంది.

తాజా వార్తలు