కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న చిత్రం డార్జిలింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం డార్జిలింగ్ లో సుమారు 25 రోజుల పాటు చిత్రబృందం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించారు.
కాగా ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి , బాబీ సింహ వంటి ప్రముఖ నటులు నటిస్తుండగా ఈ చిత్రంలో సీనియర్ సౌత్ హీరోయిన్ సిమ్రాన్ తో పాటు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


