“రజినీకాంత్ యానిమేషన్ పై ఉన్న అపోహలను పోగోడుతారు” – సౌందర్య రజినీకాంత్

“రజినీకాంత్ యానిమేషన్ పై ఉన్న అపోహలను పోగోడుతారు” – సౌందర్య రజినీకాంత్

Published on May 3, 2014 10:28 PM IST

Soundarya-Rajinikanth
హాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ యానిమేషన్ సినిమాలను వచ్చినప్పటికీ, మన సినీ ఇండస్ట్రీలో మాత్రం యానిమేషన్ పెద్ద పాత్ర పోషించలేకపోయింది. భారతదేశంలోని కొన్ని యానిమేష స్టూడియోలు ‘లైఫ్ అఫ్ పై’, ‘గోల్డెన్ కంపాస్’ వంటి బ్లాక్ బస్టర్ హాలీవుడ్సినిమాలకు పని చేశాయి.

కానీ ఇప్పుడు సౌందర్య రజినీకాంత్ ‘కోచాడియన్’ పేరుతో భారతదేశంలోనే మొట్ట మొదటి ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్ సినిమాను తెరకేకిస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ మరియు దీపిక పదుకొనే హీరో హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఇటివల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రస్తుతం మన దేశంలో యానిమేషన్ ఇండస్ట్రీ ఎలా ఉంది, యానిమేషన్ సినిమాలు తీయడం ఎంత కష్టం అనే విషయాల గురించి ఈ సినిమా దర్శకురాలు సౌందర్య తెలిపారు. యానిమేషన్ ని మన దేశంలో ఇంకా ఒక కార్టూన్ లా భావిస్తున్నారని అందుకే ఎవరికీ అర్ధం కావట్లేదు అని ఆమె అన్నారు. సమయం మరియు బడ్జెట్ పరిమితులు ఉన్నందున యానిమేషన్ లోని అన్ని అంశాలను చుపించలెకపొయమని సౌందర్య చెప్పారు. యానిమేషన్ పై ఉన్న అపోహలన్ని ‘కోచాడియన్’ మరియు రజినీకాంత్ లతో తొలిగిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఏఅర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 9న తెలుగు, తమిళ్ మరియు హింది భాషలలో విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమా ‘విక్రమసింహ’ పేరుతో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు