సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు దర్శకత్వం చేయాలనుందని తన మనసులో కోరికను బయటపెట్టారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడిగా రోహిత్ శెట్టికి హిందీలో మంచి పేరు ఉంది. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ అగ్ర హీరోలు రోహిత్ శెట్టితో పని చేయడానికి ఎదురుచూస్తున్నారు. అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఈజీగా 100 క్రోర్ కలెక్షన్ క్లబ్ లో చేరుతున్నాయి.
ఇటివల రోహిత్ శెట్టి హైదరాబాద్ వచ్చారు. ‘లింగా’ షూటింగ్ జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలిశారు. ‘రోహిత్.. నేను నీ సినిమాలకు పెద్ద అభిమానిని. నీ వర్క్ అంటే చాలా ఇష్టం. ‘ అని రజిని చెప్పడంతో ‘గోల్ మాల్’ దర్శకుడి ఆనందానికి అవధులు లేవు. అగ్ర హీరో తనను ప్రశంసించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. అమితాబ్ బచ్చన్ & రజినీకాంత్ సినిమాలకు దర్శకత్వం వహించాలనేది నా కోరిక. త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నాను అని రోహిత్ శెట్టి చెప్పారు. మరి రజినీకాంత్ ఈ దర్శకుడి అవకాశం ఇస్తారా..? వెయిట్ & సి.
షారుఖ్ ఖాన్, దీపిక పడుకొనే జంటగా తెరకెక్కించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’లో రజినీకాంత్ పై పాటను పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు రోహిత్ శెట్టి.


