రిలీజ్ కి ముందే అవార్డు అందుకున్న రజినీ కుమార్తె

Soundarya-Rajnikanth
రజినీ కాంత్ కుమార్తె సౌందర్య అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’. ఈ సినిమా విడుదలకి ముందే ఎన్డీ టీవీ ఇండియన్ అఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డుల వేడుక న్యూ ఢిల్లీలో జరిగింది.

టెక్నికల్ గా హైరేంజ్ లో ఉన్నందున ఈ సినిమాకి అవార్డు వచ్చింది. రన్బీర్ కపూర్ చేతుల మీదుగా సౌందర్య ఈ అవార్డు ని అందుకుంది. ఈ కార్యక్రమంలో రన్బీర్ కపూర్ యానిమేషన్ అనేది ఒక నటున్ని పూర్తిగా రీప్లేస్ చేయదు అని చెప్పగా దానికి సౌందర్య యానిమేషన్ అనేది కార్టూన్ కాదు ఎక్స్ ప్రెషన్స్ ని కూడా కాప్చూర్ చేస్తుంది అని సమాధానం ఇచ్చింది. కానీ ఇదంతా సరదాగా జరిగింది.

ఈ విషయంపై స్పందించిన సౌందర్య మదర్ లత ‘సౌందర్యలో చిన్నప్పటి నుంచి క్రియేటివిటీ ఎనర్జీ ఉంది. అది మెచ్యూర్ అయ్యి ఒక యానిమేషన్ డైరెక్టర్ గా మారడం చాలా ఆనందంగా ఉందని’ తెలిపింది. తమిళంలో ‘కొచ్చాడియాన్’ గా, తెలుగులో ‘విక్రమసింహా’ గా మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version