సౌత్ ఇండియన్ ఆల్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్ తన తదుపరి మాఫియా ఎంటర్టైనర్ ‘కబాలి'(తమిళ్ టైటిల్) సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపించనున్న లుక్ పై స్పెషల్ ఫోటోషూట్ ని నిర్వహించారు. అందులో నుంచి రిలీజ్ అయిన ఓకే ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. కబాలి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 17 నుంచి మొదలు పెట్టడానికి అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. షూటింగ్ డేట్ లో పెద్ద చేంజ్ లేకపోయినా షూటింగ్ లొకేషన్ లో మాత్రం చేంజ్ చేసారు. కథా ప్రకారం ఈ సినిమాలోని ఎక్కువ భాగం మలేషియాలో షూట్ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే మొదట మలేషియాలో మొదటి షెడ్యూల్ ని షూట్ చేసి ఫైనల్ షెడ్యూల్ ని చెన్నైలో షూట్ చేయాలని అనుకున్నారు.
కానే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం మొదటి షెడ్యూల్ చెన్నైలో మొదలు కానుంది. చెన్నైలో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత ఈ చిత్ర టీం మలేషియాకి వెళ్లనుంది. ఈ సినిమాలో రజినీకాంత్ స్టైలిష్ హెయిర్ స్టైల్ మరియు వైట్ గడ్డం లుక్(సాల్ట్ అండ్ పెప్పర్ లుక్) లో కనిపిస్తాడు. షూటింగ్ మొదలు పెట్టే రోజున ‘కబాలి’ స్టిల్స్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేయనున్నారు. సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా డాన్ పాత్రని స్పూర్తిగా తీసుకున్న ఈ సినిమాలో రజినీకాంత్ కబాలీశ్వరన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ధన్సిక, కలైరాసన్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.


