సూపర్ స్టార్ తన సినిమా విడుదలతోనే చరిత్ర సృష్టించాడు !

Published on Jun 7, 2018 6:45 pm IST

‘సూపర్ స్టార్ రజనీకాంత్’ తన సినిమా కలెక్షన్స్ తోనే కాదు, తన సినిమా రిలీజ్ తోనూ చరిత్ర సృష్టిస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘కాలా’. ఈ చిత్రం ఇంతవరకు ఏ తమిళ సినిమా విడుదల అవ్వనంత భారీ స్థాయిలో ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ విడుదలతోనే రజనీ ‘కాలా చిత్రం’ చరిత్ర సృష్టించింది. సౌదీ అరేబియాలో రిలీజ్ అయిన మొట్టమొదటి భారతీయ సినిమాగా ఈ చిత్రం చరిత్రకెక్కింది. సౌదీ అరేబియాలో ‘కింగ్డమ్’ తర్వాత 35 సంవత్సరాల బ్యాన్ ను దాటుకొని రజనీ ‘కాలా’ చిత్రం విడుదలవ్వడం నిజంగా హిస్టారిక్ మూమెంటే.

సంబంధిత సమాచారం :

X
More