భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లింగ’ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని యంగ్ డైరెక్టర్ అయిన పిఎ రంజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత నెల రోజులపై నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రజినీకాంత్ తన వయసుకు తగ్గా మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నాడని ఇదివరకే తెలియజేశాం. తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ ఈ సినిమాలో కబాలీశ్వరస్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా దాన నుంచి స్పూర్తిగా తీసుకొని చేస్తున్నారు.
కొన్ని విషయాల్లో చాలా హార్డ్ గా ఉండే ఈ మాఫియా డాన్ చాలా మంచి పనులు కూడా చేసాడు. అందుకే ఆ ఏరియాలో అతని సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే ఈ సినిమాకి తమిళ్లో ‘కబాలి’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 18న రజినీ మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి పలువురు యంగ్ టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేయనున్నారు. రజినీకాంత్ షూటింగ్ మొదలు పెట్టిన 45 రోజుల్లో తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేయనున్నాడు.


